వైసీపీ ఓట్ల కంటే అవే ఎక్కువ... బీజేపీ ఎంపీ సెటైర్లు

ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

news18-telugu
Updated: October 16, 2019, 1:53 PM IST
వైసీపీ ఓట్ల కంటే అవే ఎక్కువ... బీజేపీ ఎంపీ సెటైర్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
  • Share this:
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సమస్యలపై గ్రీవేన్స్ సెల్ ఏర్పాటు చేస్తే... వైసిపికీ వచ్చిన ఓట్లు కంటే దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని సుజనా చౌదరి వ్యంగ్యస్త్రాలు సంధించారు. జగన్ ఇతర పార్టీ నేతలను టార్గెట్ చేయడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టడంలో టిడిపి విఫలమైందని సుజనా ఆరోపించారు. రాజ్యాంగ పరిపాలనకు అతీతులమన్నట్టగా సీఎం జగన్ భావిస్తున్నారని బీజేపీ ఎంపీ విమర్శించారు.

పోలవరం రివర్స్ టెంటరింగ్ విషయంలో కేంద్రం, హైకోర్టు మొట్టికాయలు వేసిన ఏపీ సీఎం జగన్ పట్టించుకోలేదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వమే సమస్యలను సృష్టించడం ఏపీలోనే జరుగుతోందని సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. తాము చేపడుతున్న గాంధీజీ సంకల్ప యాత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామమని ఆయన స్పష్టం చేశారు.


First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు