దొందూ దొందే.. జగన్100 రోజుల పాలనపై సుజనా

సీడ్ క్యాపిటల్‌కి, క్యాపిటల్ రీజియన్‌కి కూడా తేడా తెలియని వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారని సుజనా అన్నారు. తన మీద ఆరోపణలు చేసిన వారికి సవాల్ విసిరితే, ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదన్నారు.

news18-telugu
Updated: September 7, 2019, 7:58 PM IST
దొందూ దొందే..  జగన్100 రోజుల పాలనపై సుజనా
వైఎస్ జగన్,సుజనా చౌదరి
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వందరోజుల పాలనపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ వంద రోజుల పాలన, చంద్రబాబు పాలన ఒకేలా ఉందని, దొందూ దొందే అన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో ఆందోళన కలిగించడం ఒక్కటే జగన్ సాధించిన విజయం అని సుజనా చౌదరి వ్యంగ్యంగా మాట్లాడారు. అమరావతిలో సుమారు రూ.30వేల కోట్ల పనులు ఇచ్చారని సుజనా చౌదరి అన్నారు. అందులో రూ.9వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల పనులు జరిగాయని, రూ.6వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారని చెప్పారు. రాజధాని మునిగిందని సాక్షాత్తూ ఓ మంత్రి ప్రకటించారని, అయితే, మరి బాధిత రైతులను ఒక్కరైనా పరామర్శించారా? అని సుజనా చౌదరి ప్రశ్నించారు. సీడ్ క్యాపిటల్‌కి, క్యాపిటల్ రీజియన్‌కి కూడా తేడా తెలియని వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారని సుజనా అన్నారు. తన మీద ఆరోపణలు చేసిన వారికి సవాల్ విసిరితే, ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదన్నారు.

కేబినెట్‌లో 60శాతం పదవులు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకే ఇచ్చామని చెబుతున్నారని, అయితే కీలక పోస్టులు అన్నీ వేరే సామాజికవర్గాలకు దక్కాయన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలకే కొన్నిటికి పేర్లు మార్చారని, మరికొన్నింటిని ఎత్తేశారని మండిపడ్డారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న జగన్ నిర్ణయం వల్ల ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయే పరిస్థితి ఉందన్నారు. అసలు 75 శాతం కోటా అనేదే రాజ్యాంగబద్ధం కాదన్నారు. గత ప్రభుత్వంలో భూకబ్జాలను వెలికితీస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. ఈ మూడు నెలల కాలంలో ఎవరెవరు కబ్జాలు చేశారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని సుజనా చౌదరి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి బాగోలేదనే అభిప్రాయం పారిశ్రామికవేత్తల్లో ఉందని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని సుజనా చౌదరి అన్నారు. మచిలీపట్నం పోర్టును రద్దు చేసిన జగన్ ప్రభుత్వం.. కొత్తగా నాలుగు పోర్టులు ఏర్పాటు చేస్తామనడం చూస్తుంటే.. తినడానికి తిండిలేదు కానీ మీసాలకు సంపెంగనూనెలా ఉందన్నారు. ప్రత్యేక హోదా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయొద్దని చెప్పారు.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading