మహా ఎపిసోడ్‌‌తో మారిన లెక్కలు... సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి?

Sujana Chowdary | ఏపీలో బలపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: November 11, 2019, 4:01 PM IST
మహా ఎపిసోడ్‌‌తో మారిన లెక్కలు... సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి?
బీజేపీ నేత సుజనా చౌదరి
  • Share this:
బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి కేంద్రంలో కీలక పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని భావిస్తున్న బీజేపీ.. కేంద్ర ప్రభుత్వంలో సుజనా చౌదరికి ప్రాతినిధ్యం కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సుజనా చౌదరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయినప్పటికీ.. ఆయన ఎప్పుడూ రాష్ట్రంలోనే ఎక్కువకాలం గడుపుతున్నారు. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడు కావడంతో పలుమార్లు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం పెద్దలు, పార్టీ పెద్దలతో కూడా పలుమార్లు సమావేశం అవుతున్నారు.

Tdp mla vallabhaneni vamsi meet bjp mp sujana chowdary avr
బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిసిన వల్లభనేని వంశీ..


మరోవైపు ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కూడా ఆయనే చేపడుతున్నారు. టీడీపీకి చెందిన పలువురు నేతలతో చర్చలు జరుపుతూ.. వారిని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వల్లభనేని వంశీతో కూడా చర్చించారు. దీంతోపాటు విశాఖకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేకు కమలం కండువా కప్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీటితోపాటు బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణల నుంచి బయటపడేందుకు కూడా సుజనా చౌదరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుజనా గ్రూప్‌లో తనకు ఉన్న పదవులు అన్నిటినీ వదిలిపెట్టారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనకు మంత్రిపదవి ఇవ్వనున్నట్టు సమాచారం.

బీజేపీలో చేరిన సుజనా చౌదరి (File)


మహారాష్ట్రలో విబేధాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి శివసేన వైదొలగింది. శివసేనకు చెందిన కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిని ఏపీకి చెందిన సుజనా చౌదరితో భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా మొదలైంది. ఒకవేళ ఆ పదవి లేకపోతే మరో పదవి అయినా తప్పకుండా దక్కుతుందని సుజనా చౌదరి సన్నిహితులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీయేలో ఉన్న సమయంలో ఆయన కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. అప్పుడు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఏపీకి అన్యాయం చేశారంటూ ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకోవడంతో కేంద్రంలో మంత్రిపదవులకు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు రాజీనామాలు చేశారు. మళ్లీ మరోసారి సుజనా చౌదరిని అదృష్టం వరిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ - శివసేన వ్యవహారం అప్పుడే ముగిసిపోలేదనే వాదన కూడా ఉంది.
First published: November 11, 2019, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading