Home /News /politics /

BJP MP SUJANA CHOWDARY CRITICIZES AP GOVERNMENT DECISION ON POLAVARAM PROJECT AND OTHER ISSUES AK

ఏపీలో అన్నీ ఆపేశారు... ఇలాగైతే కష్టమన్న బీజేపీ ఎంపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో ప్రతిపాదనలు, సూచనలు ఇచ్చింది ప్రస్తుతం ఉన్న అధికారులే అని సుజనా చౌదరి అన్నారు. గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అనుమతి తరువాతే కాంట్రాక్ట్ కంపెనీ మారిందని ఆయన గుర్తు చేశారు.

    ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అన్నీ ఆపేశారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. పోలవరం పనులు, రాజధాని అమరావతి నిర్మాణం పనులు, ఇసుక సహా అన్నీ ఆపేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ఏపీ అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటుందని సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి సంబంధిత కంపెనీలను తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని సుజనా చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం సహజమని... అలాగని ప్రాజెక్ట్ పనులు ఆపకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

    పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో ప్రతిపాదనలు, సూచనలు ఇచ్చింది ప్రస్తుతం ఉన్న అధికారులే అని సుజనా చౌదరి అన్నారు. గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అనుమతి తరువాతే కాంట్రాక్ట్ కంపెనీ మారిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా పోలవరం పనుల నిలిపివేత విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదని అన్నారు. ఈ అంశంపై సోమవారం నుంచి రివ్యూ చేద్దామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తనతో అన్నారని సుజనా చౌదరి తెలిపారు.

    Sujana chowdary criticizes ap government,sujana chowdary comments on polavaram project,sujana chowdary targets ap cm ys jagan,sujana chowdary targets ysrcp,sujana comments on Amaravati,ఏపీ ప్రభుత్వంపై సుజనా చౌదరి విమర్శలు,పోలవరంపై సుజనా చౌదరి కామెంట్స్,సీఎం జగన్‌పై సుజనా చౌదరి విమర్శలు
    సుజనా చౌదరి


    ఏపీలో వ్యక్తిగత దూషణలతోనే అసెంబ్లీ సమయం అంతా గడిచిపోయిందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పరిపాలన విషయంలో ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రగతి తిరోగమనంలో పయనిస్తుందని సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా సరికాదని ఆయన వ్యాఖ్యనించారు.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bjp, Polavaram, Sujana Chowdary, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు