Home /News /politics /

BJP MP SUJANA CHOWDARY COUNTER TO GVL NARASIMHA RAO ON AMARAVATI AK

ఎంపీ వర్సెస్ ఎంపీ... అమరావతిపై బీజేపీలో డైలమా

అమరావతి, సుజనా, జీవీఎల్

అమరావతి, సుజనా, జీవీఎల్

అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

    ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై బీజేపీ వైఖరి ఏమిటనే అంశంపై క్లారిటీ రావడం లేదు. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం దీనిపై భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ రాజధాని తరలింపు అనే అంశం కేంద్రం పరిధిలోకి రాదని... దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవదని కొద్ది రోజుల క్రితం బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. అమరావతిని అంగుళం కూడా కదపలేరని ఆయన మరో స్పష్టం చేశారు. కేంద్రం పరిధిలోకి ఎలా వస్తుందో నాకు క్లారిటీ ఉందని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.

    దీనిపై పార్టీ పెద్దలతో మాట్లాడానని... అమరావతియే రాజధాని అని అన్నారు. దీనిపై బీజేపీ విధానం ఒకటే అని తెలిపారు. రాజధాని ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వెళ్లాలంటే...రూ. లక్షా 50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ అంశంపై దేశంలోని ప్రముఖ న్యాయవాదులతో తాను మాట్లాడానని అన్నారు. అవసరమైతే రైతుల పక్షాన లీగల్‌గా నేనే నిలబడతానని స్పష్టం చేశారు. తాను బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో మాట్లాడలేదని సుజనా చౌదరి అన్నారు. కానీ పార్టీ పెద్దలందరితో మాట్లాడానని వివరించారు. బీజేపీలో అధికార ప్రతినిధులు ఎంతో మంది ఉన్నారని...అందులో జీవీఎల్ నరసింహారావు ఒకరని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.

    అయితే అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ విషయంలో తాను చెప్పిందే ఫైనల్ అని ఆయన మొన్న జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. బీజేపీలో ఎంతోమంది ఎంపీలు ఉన్నారని... వారిలో సుజనా చౌదరి ఒకరని ఆయన అన్నారు. అమరావతిపై ఆయన అభిప్రాయం పూర్తిగా ఆయన వ్యక్తిగతమని అన్నారు. అయితే బీజేపీలో అధికార ప్రతినిధులు ఎంతో మంది ఉన్నారని...అందులో జీవీఎల్ నరసింహారావు ఒకరని సుజనా చౌదరి ఇందుకు కౌంటర్ ఇచ్చారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Bjp, GVL Narasimha Rao, Sujana Chowdary

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు