ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలను అధినేతకు తెలిపానన్నారు. వెంటనే స్పందించరు, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు ఇలాంటి విషయాలను మాత్రం తాను ఫిర్యాదు చేసినట్టు సుజనా చెప్పుకొచ్చారు.
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి కాషాయం కండువా కప్పుకున్నారు మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. ఇలా పార్టీ మారి వారం కూడా కాలేదు కానీ... అప్పుడే టీడీపీ అధినేతపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు సుజనా. ఓ మీడియా ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్య్యూలో మాట్లాడుతూ... ఆయన చంద్రబాబుపై కొన్ని ఆరోపణలు చేశారు. చంద్రబాబుతో ఒక్క విషయంలో విభేధించానన్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేస్తున్న సమయంలో అలా చేయడం తప్పని చంద్రబాబుతో వాదించానన్నారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలను అధినేతకు తెలిపానన్నారు. వెంటనే స్పందించరు, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు ఇలాంటి విషయాలను మాత్రం తాను ఫిర్యాదు చేసినట్టు సుజనా చెప్పుకొచ్చారు. అయితే ఎలాంటి మార్పు లేకపోవడంతో 2017 నుంచి ఫిర్యాదు చేయడం కూడా మానేశానన్నారు.
అయితే లోకేష్ విషయంలో తనకెలాంటి విబేధాలు లేవన్నారు. నారా లోకేశ్ కు పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వడం తొందరపాటు అవుతుందని తాను ఎప్పుడూ కూడా చంద్రబాబుతో అనలేదన్నారు. సీనియర్లు ఉన్నప్పుడు లోకేశ్‌ను కొంతకాలం పాటు ఆపాలని తాను చంద్రబాబుతో అన్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదన్నారు. నారా లోకేష్ విషయంలో తనెప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు సుజనా చౌదరి. మరి ఇప్పుడు సుజనా చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.