హోమ్ /వార్తలు /రాజకీయం /

అమరావతికి అదే రక్ష... బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

అమరావతికి అదే రక్ష... బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలని భావిస్తే కుదరదని... ప్రజాధనం వృధా చేయడం సరికాదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.

  అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి... ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్ అన్ని ఒకే చోట ఉండాలని ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే చట్టంలో ఇలాంటి నిబంధన పెట్టినట్టు అర్థమవుతోందని సుజనా చౌదరి వివరించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలని భావిస్తే కుదరదని... ప్రజాధనం వృధా చేయడం సరికాదని ఆయన అన్నారు.

  అమరావతికి అదే రక్ష... బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు | Bjp mp sujana chowdary comments on cm ys jagan and Amaravati ak
  సుజనా చౌదరి

  ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండాలని... లేనిపక్షంలో ఆ తరువాత న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 2004 నుంచి 2009 మధ్యకాలంలో జరిగిన కొన్ని నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అమరావతి విషయంలో కేంద్రం చర్యలు తీసుకునే సమయం ఇంకా రాలేదని సుజనా చౌదరి అన్నారు. సమయం వచ్చినప్పుడు కేంద్రం ఈ అంశంపై స్పందిస్తుందని ఆయన తెలిపారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Amaravati, Ap cm ys jagan mohan reddy, Sujana Chowdary

  ఉత్తమ కథలు