చంద్రబాబు ప్లాన్ అదే... సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వివాదంపై కూడా సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంకా ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నారో తనకు అర్థంకావడం లేదని సుజనా చౌదరి అన్నారు.

news18-telugu
Updated: September 25, 2019, 8:09 PM IST
చంద్రబాబు ప్లాన్ అదే... సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు
సుజనా చౌదరి (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. రివర్స్ టెండరింగ్‌లో కేవలం ఒకే ఒక్క కంపెనీ పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కనీసం ఇద్దరు కూడా లేకుండా రివర్స్ టెండరింగ్ అంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇక చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వివాదంపై కూడా సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంకా ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నారో తనకు అర్థంకావడం లేదని సుజనా చౌదరి అన్నారు. తానైతే అలాంటి ఇంట్లో ఉండనని స్పష్టం చేశారు.

అద్దె ఇంట్లో సమస్య వస్తే అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే బాగుంటుందని ఆయన అన్నారు. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు విపక్షం ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి ప్రతిరోజు ఈ అంశంపైనే మాట్లాడటాన్ని ఎంపీ సుజనా చౌదరి తప్పుబట్టారు.


First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>