Home /News /politics /

BJP MP SUJANA CHOWDARY COMMENTS ON AP CM YS JAGAN MOHAN REDDY AK

జగన్ అలా కూడా అంటారేమో... మండిపడ్డ బీజేపీ ఎంపీ

సీఎం జగన్ (File)

సీఎం జగన్ (File)

Sujana Chowdary: ఏపీ ప్రభుత్వం ఎన్నికల అధికారిపై హైకోర్టు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వచ్చారని సుజనాచౌదరి మండిపడ్డారు.

    ఏపీ ‌సీఎం జగన్‌పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడారని అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం బాధాకరమని సుజనా చౌదరి అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల అధికారిపై హైకోర్టు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వచ్చారని సుజనాచౌదరి మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యం అనేలా ప్రభుత్వ తీరు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారికి కులాన్ని అంటకట్టడం మంచిది కాదని సూచించారు.

    Sujana chowdary, bjp, tdp, ysrcp, cm ys jagan mohan reddy, ap news, ap politics, సుజనా చౌదరి, బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
    సుజనా చౌదరి


    సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా కులం ఆపాదించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడి హత్యాయత్నమేనని సుజనా ఆరోపించారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని సుజనాచౌదరి విమర్శించారు. ఏకగ్రీవం అయిన చోట్ల మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కన్నాపై వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bjp, Sujana Chowdary, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు