Home /News /politics /

BJP MP SUJANA CHOWDARY COMMENTS ON AMARAVATI AND YSRCP AK

ఏపీలో అలా జరిగితే... దేశం విడిచిపోవడం మేలన్న బీజేపీ ఎంపీ

సుజనా చౌదరి

సుజనా చౌదరి

అమరావతి ప్రాంతంలో అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారని మండిపడ్డారు. ఏ నిబంధనలు ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారని సుజనా చౌదరి విమర్శించారు.

  అమరావతిని అంగుళం కూడా కదల్చలేరనే వ్యాఖ్యలను తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. అమరావతి విషయంలో తమ పోరాటానికి బీజేపీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని... అలా జరగని పక్షంలో సొంతంగానే సమస్య పరిష్కారమయ్యేవరకు తాను పోరాటం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆపలేకపోతే దేశం విడిచి మరో దేశానికి శరణార్ధులుగా వెళ్లిపోవడం మేలు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయిందని... ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదని సుజనా చౌదరి అన్నారు.

  అవసరం లేకున్నా 144 సెక్షన్ పెడుతున్నారని మండిపడ్డారు. ఏ నిబంధనలు ప్రకారం అర్ధరాత్రి పోలీసులు ఇళ్లకు వెళుతున్నారని సుజనా చౌదరి విమర్శించారు. అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించుకోకుండా అడ్డుకున్నారు. కులం వివరాల కోసం ఇబ్బందులు పెడతారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డీజీపీ చోద్యం చూస్తున్నారని సుజనా చౌదరి అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. అమరావతి పరిణామాలపై కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోందని సుజనా చౌదరి తెలిపారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Amaravati, Sujana Chowdary, Tdp, Ysrcp

  తదుపరి వార్తలు