చంద్రబాబుకు మద్దతుగా సుజనాచౌదరి.. జగన్ పాలనపై విమర్శలు

చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పాలసీ ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు.

news18-telugu
Updated: August 17, 2019, 6:23 PM IST
చంద్రబాబుకు మద్దతుగా సుజనాచౌదరి.. జగన్ పాలనపై విమర్శలు
సుజనా చౌదరి (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 17, 2019, 6:23 PM IST
ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పాలసీ ఉందని విమర్శించారు. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల కృష్ణా నదికి వరద నీరు పోటెత్తడంతో కరకట్ట మీద చంద్రబాబు నివాసం వద్దకు నీరు వచ్చాయి. దీని మీద పెద్ద దుమారం చెలరేగింది. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో పాటు చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాలు వెళ్లడంతో దుమారానికి మరింత ఆజ్యం పోసింది. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందంటూ టీడీపీ వాదించింది. అయితే, వరద నష్టాన్ని అంచనా వేసేందుకే తాము డ్రోన్ కెమెరాలతో సర్వే చేస్తున్నామని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయకపోతే చంద్రబాబుకు భయం ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడి వైసీపీ మీద విమర్శలు చేయడం ఆసక్తిగా మారింది.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...