Home /News /politics /

BJP MP SUBRAHMANYA SWAMY FILED DEFAMATION CASE ON TELUGU MEDIA CHANNEL OVER BAD PROPAGANDA ON TIRUMALA TIRUPATI DEVASTHANAM FULL DETAILS HERE PRN

Subrahmanya Swamy: టీటీడీపై అసత్య ప్రచారానికి కౌంటర్... సీఎంతో సుబ్రహ్మణ్యస్వామి భేటీ... చంద్రబాబే టార్గెట్...

సీఎం జగన్మోహన్ రెడ్డితో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ

సీఎం జగన్మోహన్ రెడ్డితో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తిరుమల తిరుపతి దేవస్థానంపై (Tirumala Tirupati Devasthanam) జరుగుతున్న అసత్య ప్రచారం, దేవాలయాలపై దాడుల విషయంలో సరైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

    ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానంపై జరుగుతున్న అసత్య ప్రచారం, దేవాలయాలపై దాడుల విషయంలో సరైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బేజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ అయ్యారు. టీటీడీపై ఓ వర్గం మీడియాలో అసత్య ప్రచారం, అలాగే శ్రీవారి ఆలయంపై ప్రభుత్వ అజమాయిషీ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈక్రమంలో బుధవారం ఉదయమే శ్రీవారిని దర్శించుకున్న సుబ్రహ్మణ్య స్వామి.. టీటీడీపై ఆసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం యథేచ్ఛగా సాగుతోందని, ఏడుకొండలపై చర్చి, శిలువ నిర్మాణం సాగుతోందంటూ మీడియాలో వచ్చిన కథనాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అసత్య వార్తలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా హౌస్ పై ఏకంగా వందకోట్ల రూపాయలకు దావా వేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి ఆలయంపై కొంతమంది ఉద్దేశపూరకంగా అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రదాన ప్రతిపక్షమైన టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసే మీడియాలో దీనిపై కథనాలు బాగా వచ్చాయని .. రాజకీయ కారణాలతో ఇలా చేశారని విమవరించారు. తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలించించేలా వార్తలు ప్రచురిస్తున్న ఛానల్ పై 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. భక్తులు ఎంతగానో విశ్వసించే తిరుమలేశుడిపై రాజకయ కారణాలతో తప్పుడు ప్రచారం చేస్తుండటం సరైన పద్ధతికాదన్నారు.

    ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడునికి కూడా సుబ్రహ్మణ్యస్వామి లాగారు. ఈ విషయంలో సదరు మీడియా సంస్థను చంద్రబాబు కూడా కాపాడలేరన్నారు. ఈ అసత్య ప్రచారానికి ముఖ్య కారణం ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడమేనన్నారు. శ్రీవారి ఆలయంపై జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికే తానే రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారాయన.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Subramanian Swamy, Tirumala Temple, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు