బీజేపీ నేతలపై చేతబడి...ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేతలపై చేతబడి తరహా కుట్ర జరుగుతోందని ఆ పార్టీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఆరోపించారు.

news18-telugu
Updated: August 26, 2019, 3:49 PM IST
బీజేపీ నేతలపై చేతబడి...ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రగ్యా సింగ్ ఠాకూర్ ( ఫైల్ చిత్రం)
  • Share this:
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్యాసింగ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ పార్టీకి చెందిన నేతల మరణానికి చేతబడి వంటి కుట్రలే కారణమని ఆమె ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల కన్నమూసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబూలాల్ గౌర్, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ సంతాప సభలో పాల్గొన్న సాధ్వి ప్రగ్యాసింగ్... ఈ కామెంట్స్ చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే సమయంలోనే మహారాజ్ అనే సాధువు చెడుకాలం ఉందని హెచ్చరించారని ఆమె తెలిపారు. అయితే అప్పట్లో తాను వాటిని పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మహారాజ్‌ చెప్పిన మాటలు నమ్మకతప్పని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రగ్యా సింగ్... బీజేపీ తరపున భోపాల్ ఎంపీ టికెట్ దక్కించుకుని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రగ్యాసింగ్... మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి విమర్శలపాలయ్యారు.


First published: August 26, 2019, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading