news18-telugu
Updated: November 28, 2019, 12:42 PM IST
ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్(File Photo)
మహాత్మాగాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సేను పార్లమెంట్ సాక్షిగా దేశభక్తుడు అని అభిప్రాయపడ్డ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓవైపు దేశం 150వ గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటుంటే బీజేపీ మాత్రం గాంధీ హంతకులను అమరవీరులుగా కీర్తిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.ప్రజ్ఞా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో బీజేపీ కూడా ఆమెపై చర్యలు తీసుకోక తప్పలేదు.రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి ప్రజ్ఞా ఠాకూర్‌ను బీజేపీ తొలగించింది. అంతేకాదు,ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు ప్రజ్ఞాను ఇక అనుమతించబోమని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.పార్లమెంటులో ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. ఇలాంటి అభిప్రాయాలను బీజేపీ ఎప్పుడూ బలపరచదని
అన్నారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రజ్ఙా వ్యాఖ్యలను ఖండించారు. నాథురాం గాడ్సేను ఎవరైనా దేశభక్తుడిగా అభిప్రాయపడితే బీజేపీ దాన్ని ఖండిస్తుందన్నారు. మహాత్మాగాంధీ తమకు ఆదర్శం అని, ఆయన తమను నడిపించే మార్గదర్శకుడని అన్నారు.
Published by:
Srinivas Mittapalli
First published:
November 28, 2019, 12:42 PM IST