రాజీవ్ గాంధీని ‘రాజీవ్ ఫిరోజ్ ఖాన్‌’గా సంబోదించిన బీజేపీ ఎంపీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా...రాజీవ్ గాంధీని రాజీవ్ ఫిరోజ్ గాంధీగా సంబోదించారు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ.

news18-telugu
Updated: February 3, 2020, 6:08 PM IST
రాజీవ్ గాంధీని ‘రాజీవ్ ఫిరోజ్ ఖాన్‌’గా సంబోదించిన బీజేపీ ఎంపీ
లోక్‌సభలో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ
  • Share this:
సీఏఏ వివాదం లోక్‌సభను కుదిపేసింది. సీఏఏ విషయంలో మోదీ సర్కారు వెనక్కి తగ్గబోదని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ స్పష్టంచేశారు. ధివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఆయన రాజీవ్ ఫిరోజ్ ఖాన్‌గా సంబోదించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మత ద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆరోపణలపై ఆయన నాలుగు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించడంగా ఎన్నికల సంఘం ఇప్పటికే నిషేధం విధించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పర్వేష్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ముస్లీం వ్యక్తి ఫిరోజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుందని గుర్తుచేశారు. అయితే వారు తమ మతాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీ ప్రసంగం ప్రారంభించిన వెంటనే సభలోని కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ సభ్యులు జై శ్రీరాం నినాదాలు చేశారు.


షహీన్ బాగ్‌లో సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు..ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా హంతకులని మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఎద్దేవా చేశారు. వాళ్లకు జిహాద్ కావాలంటూ మండిపడ్డారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్నారని ఆరోపించారు.షహీన్ బాగ్ ఆందోళనకారులకు తాను వ్యతిరేకమని చెప్పినందుకు తనపై నాలుగు రోజులు నిషేధం విధించిన ఎన్నికల సంఘం...షహీన్ బాగ్ ఆందోళనకారులకు మద్దతు తెలిపిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఎందుకు నిషేధం విదించలేదని ప్రశ్నించారు.
First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు