• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BJP MP INTENSIFYING WAR OF WORDS BETWEEN TRS MPS IN TELANGANA VB KNR

బీజేపీ ఎంపీ.. టీఆర్ఎస్ ఎంపీల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. తప్పిపోయిన ఎంపీ అంటూ వినూత్న ప్రదర్శన..

బీజేపీ ఎంపీ.. టీఆర్ఎస్ ఎంపీల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. తప్పిపోయిన ఎంపీ అంటూ వినూత్న ప్రదర్శన..

పెద్దపల్లి ఎంపీ, కరీంనగర్ ఎంపీ

కరీంనగర్ నగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి.. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ల మధ్య మాటల ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. మొన్నటి వరకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు బండి సంజయ్ కి మాటల యుద్ధం నడిచిన విషయం విధితమే. ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత సై అంటే సై అనే రేంజ్లో బండి సంజయ్ పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

  • Share this:
    ఈ మధ్య జరిగిన మంథని బీజేపీ సమరభేరి సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత పై అనుచిత వ్యాక్యాలు చేశారు. పెద్దపల్లి ఎంపీ అంటే ఇప్పటికి మాజీ ఎంపీ వివేక్ అనే అనుకుంటున్నాము.. అసలు పెద్దపల్లి కి టీఆరెఎస్ ఎంపి ఉన్నాడనే విషయం కూడా ఎవరికీ తెలియదు అని బండి సంజయ్ ఆరోపించారు . పెద్దపల్లి ఎంపీ గా గెలిచి రెండు సంవత్సరాలు ఐనా బోర్లకుంట వెంకటేష్ నేత ఒక్కసారి కూడా ప్రజా సమస్యలపై పోరాడకపోవడం.. మరియు తను ఢిల్లీ లో నే ఉంటూ, రాజభోగాలు అనుభవిస్తున్నాడని, ఇలాంటి ఎంపీ ని గెల్పించడం సిగ్గు చేటు అని అన్నాడు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చాడు. ఇక నిన్న మొన్న పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కు వచ్చిన ఎంపీ వెంకటేష్ నేత బండి సంజయ్ పై విరుచుక పడ్డాడు. చేతగాని దద్దమ్మ.. కేంద్రం నుండి తెలంగాణా నిధులు తీసుకురాని బండి సంజయ్ మాపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటు.

    కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఇప్పటివరకు రూపాయి కూడా తీసుకురాని బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడం సిగ్గుచేటు అన్నాడు. కేంద్రం నుండి నిధులు నిధులు తెలంగాణ రాష్టానికి తీసుకరాకపోతే బండి కి గుండు గీయించి.. డిల్లీ గల్లీలో నిలబెడుతాము అని ఘాటు వాక్యాలు చేశాడు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. అసలు తెలంగాణ లో నాలుగు పార్లమెంట్ సభ్యులుగా గెలిచినా బిజెపి ఎంపీలు కేంద్రం నుండి మీ మీ పార్లమెంట్ పరిధికి ఎన్ని నిధులు తెచ్చారో బహిరంగ చర్చకు మీరు సిద్ధమా..? మేము సిద్ధంగా ఉన్నామని తనదైన శైలిలో విరుచుక పడ్డాడు. ఖబర్దార్ బండి సంజయ్ ఇంకో సారి తెలంగాణా టీఆరెఎస్ ఎంపీల పైన కానీ టీఆరెఎస్ పార్టీ పై అనుచిత వాక్యాలు చేస్తే నాలుక చీరేస్తాం అంటూ ఘాటు వాక్యలు చేయడం ఇప్పుడు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

    ఇదిలా ఉండగా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ ఫొటోను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెద్దపల్లి ఎంపీ ఫోటోను పట్టుకుని ఎవరిని అడిగినా ఆయన కనిపించడం లేదనే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచినప్పటినుంచి జిల్లాలో అప్పుడప్పుడు పర్యటించడమే తప్ప వెంకటేశ్‌ ప్రజల్లో తిరగడం గానీ, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం గానీ చేయలేదని ఆంజనేయులు విమర్శించారు. ఆయనకు ధైర్యం ఉంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేసేలా నిలదీయాలని సవాల్ చేశారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు