టీడీపీ ఎంపీలతో జర్నీ షేర్ చేసుకున్న బీజేపీ ఎంపీ.. ఇంతకీ ఎవరాయన?

టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య ఢిల్లీ స్థాయిలో పోరాటం కొనసాగుతుండగా.. నేతల మధ్య మాటల తూటాలు పేతులున్నాయి. అయితే, చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ ఎంపీలతో బీజేపీకి చెందిన ఎంపీ ప్రయాణించిన ఫొటో ఇప్పుడు వైరలవుతోంది.

news18-telugu
Updated: February 11, 2019, 4:33 PM IST
టీడీపీ ఎంపీలతో జర్నీ షేర్ చేసుకున్న బీజేపీ ఎంపీ.. ఇంతకీ ఎవరాయన?
టీడీపీ ఎంపీలతో బీజేపీ ఎంపీ హరిబాబు
news18-telugu
Updated: February 11, 2019, 4:33 PM IST
టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వొకటంటే, నేను రెండంటా అన్నట్టుగా.. విమర్శలు చేసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ గుంటూరులో పర్యటించి చంద్రబాబుపై నిప్పులు చెరగడం.. చంద్రబాబునాయుడు ఢిల్లీస్థాయిలో మోదీపై పోరాటానికి దిగడం వంటి పరిణామాలు రెండు పార్టీల మధ్య మరింత నిప్పు రాజేశాయి. తాజాగా, చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకు టీడీపీ ఎంపీలంతా ఫ్లైట్‌లో వెళ్లారు. ఈ సందర్భంగా వారితో మరో పార్టీకి చెందిన ఎంపీ కూడా ప్రయాణం చేయడం విశేషం. ఆయనెవరో కాదు, టీడీపీకి బద్ధశత్రవుగా మారిపోయిన బీజేపీకి చెందిన ఎంపీ హరిబాబు. టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన ఒకేఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందిప్పుడు.

ఇంతకీ, ఈ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టిందెవరో తెలుసా? వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ట్విట్టర్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేసి రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారాయన. పబ్లిగ్గా తిట్టిపోసుకుంటూ, ప్రైవేటుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీతో కటీఫ్ అంటూనే బాబూ అండ్ కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టురట్టు రట్టైంది. అనైతిక బంధానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి... అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.

పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్‌ అంటూనే బాబు &కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టు. ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి? pic.twitter.com/Lub9FzvF6j— Vijayasai Reddy V (@VSReddy_MP) February 11, 2019

ఓవైపు తిట్టుకుంటూనే, మరోవైపు లోలోపల బీజేపీ, టీడీపీలు పొత్తును కొనసాగిస్తున్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్రంపై టీడీపీ చేస్తున్న దొంగ దీక్షలని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. సీఎం ఢిల్లీ దీక్షకు ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో.. టీడీపీ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీ హరిబాబు కూడా ప్రయాణించారు. ప్రజలకు వీరి అనుబంధం అర్థమైందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

 విజయసాయిరెడ్డి పోస్టు చేసిన ఈ ఫొటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...