HOME » NEWS » politics » BJP MP GVL NARASIMHARAO COMMENTS ON PAWAN KALYAN SB

కొందరు పాకిస్థాన్‌లో హీరోలు కావాలనుకుంటున్నారు: జీవీఎల్

ఇప్పటికైనా పాక్‌కు ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిస్తే పవన్‌కు ప్రజాదారణ ఉంటుందన్నారు జీవీఎల్.

news18-telugu
Updated: March 2, 2019, 11:43 AM IST
కొందరు పాకిస్థాన్‌లో హీరోలు కావాలనుకుంటున్నారు: జీవీఎల్
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)
  • Share this:
జనసేన అధినేతపై విమర్శలు గుప్పించారు... బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. ఈ మధ్య పవన్ కళ్యాన్ వింతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌ను షార్ట్‌కట్‌లో పీకే అంటారని.. అందుకే పవన్ కళ్యాన్ పీకే నేమ్‌తో పెట్టిన కామెంట్స్ పాక్‌లో వైరల్ అయ్యాయని ఎద్దేవా చేశారు. పవన్ వాడిన మాటలు పాకిస్థాన్ ప్రధానంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ఓట్ల కోసం జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్ని వాడుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా భారత్-పాకిస్థాన్ యుద్ధానికి ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిస్తే పవన్‌కు ప్రజాదారణ ఉంటుందన్నారు జీవీఎల్.

విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై కూడా ఫైర్ అయ్యారు. రైల్వే జోన్ అంశంలో మోదీకి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. అనేక కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్ వేసుకున్నారన్నారని విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాల్ని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదన్నారు. నిన్న మోదీనే స్వయంగా బాబు బండారాన్ని ప్రజలకు వివరించారన్నారు. ఒక్క దాడితో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. భారత్ చేసిన ఎదురు దాడి వల్లే పాకిస్థాన్ తోక ముడిచిందన్నారు జీవీఎల్. అభినందన్ ధైర్యసాహసాలతో పాటు మోడీ దౌత్యం కూడా బాగా పనిచేసిందన్నారు. దేశ ప్రజలంతా మోడీ, అభినందన్‌ను మెక్తకంఠంతో అభినందిస్తున్నారన్నారు.
First published: March 2, 2019, 11:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading