HOME »NEWS »POLITICS »bjp mp gvl narasimha rao slams tdp ysrcp in andhra pradesh ak

ఆ నలుగురే ఉన్నారా?.. టీడీపీ, వైసీపీపై మండిపడ్డ బీజేపీ ఎంపీ

ఆ నలుగురే ఉన్నారా?.. టీడీపీ, వైసీపీపై మండిపడ్డ బీజేపీ ఎంపీ
జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)

రెండు ప్రాంతీయ పార్టీల వల్ల ఏపీ అభివృద్ధి కుంటుపడిందని జీవీఎల్ ఆరోపించారు.

  • Share this:
    ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఏపీలో ఎన్టీఆర్‌, చంద్రన్న, వైఎస్సార్‌, జగనన్న మాత్రమే మహానాయకులా అని ఆయన ప్రశ్నించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన ప్రకాశం, వీరేశలింగం కనిపించరా అని నిలదీశారు. కుటుంబ రాజకీయాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడతారా ? అని ప్రశ్నించారు. రెండు ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని జీవీఎల్ ఆరోపించారు. ఇసుక మాఫియా పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. అవినీతి నిర్మూలన అనేది రాజకీయ కోణంలోనే వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదని జీవీఎల్ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తప్పుబట్టారు. ఏపీకి రాజకీయంగా 4 గ్రహణాలు పట్టాయని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.






    First published:June 26, 2020, 16:57 IST