news18-telugu
Updated: December 4, 2019, 4:23 PM IST
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
తాను బీజేపీతో కలిసే ఉన్నామని... కేవలం ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే ఆ పార్టీ విధానంతో విభేదించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నిన్న అమిత్ షాను పొగిడిన పవన్... ఈ రోజు మళ్లీ బీజేపీకు అనుకూలమనేలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి దగ్గరయ్యేకుందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని... అందుకే ఆ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. త్వరలోనే జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ సానుకూలంగా స్పందిస్తూనే... షరతులు వర్తిస్తాయనే రకంగా వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తాము ఎన్నికలకు ముందే జనసేనను బీజేపీలో విలీనం చేయాలని కోరామని... కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని ఆయన అన్నారు. అయితే రాజకీయల కారణాలతో మా భుజాలపై నుంచి ఆరు అడుగుల బుల్లెట్‌ను వేరే వాళ్లపై సంధించాలనుకుంటే పొరపాటే అవుతుందని పవన్ కళ్యాణ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు.

జీవీఎల్ నరసింహారావు
బీజేపీ విధానాలు నచ్చి... తమతో కలిసి పని చేసేందుకు ఎవరూ వచ్చినా తమకు అంగీకారమే అని జీవీఎల్ అన్నారు. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ విలీన ప్రతిపాదనతో వస్తే స్వాగతిస్తామని తెలిపారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
December 4, 2019, 4:22 PM IST