అగ్రిగోల్డ్ దుమారం: సీఐడీకి బీజేపీ ఎంపీ జీవీఎల్ కొత్త భాష్యం

అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఒకటైన హాయ్‌లాండ్‌పై మంత్రి లోకేష్ కన్నుపడిందని.. అందుకే దాని అమ్మకం విషయంలో జాప్యం జరుగుతోందని జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: October 23, 2018, 3:10 PM IST
అగ్రిగోల్డ్ దుమారం: సీఐడీకి బీజేపీ ఎంపీ జీవీఎల్ కొత్త భాష్యం
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)
  • Share this:
ఏపీలో అగ్రిగోల్డ్ ఆస్తుల వివాదం బీజేపీ - టీడీపీ మధ్య చిచ్చు రాజేస్తోంది. టీడీపీ నేతలే టార్గెట్‌గా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు 254 ఉంటే.. 54 మాత్రమే ఎందుకు బయటపెట్టారని ఆయన ప్రశ్నించారు. ఆ సంస్థ ఆస్తులన్నీ పసుపుచొక్కాల జేబుల్లోకి వెళ్తున్నాయని జీవీఎల్ మండిపడ్డారు. 2014 చివర్లో ఈ కేసు నడుస్తోందని.. అప్పుడు 25వేల కోట్ల రూపాయలు ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు ఇప్పుడు రూ.2500 కోట్లకు తగ్గిపోవడం వెనుక కారణం ఏంటని జీవీఎల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసు విచారణ జరుపుతున్న సీఐడీ మీద కూడా జీవీఎల్ విమర్శలు గుప్పించారు. సీఐడీ.. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన సీఐడీ.. చంద్రన్న ఇంట్రెస్ట్ డిపార్ట్‌మెంట్‌గా మారిందని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం విషయంలో ఎందరో మంత్రులు, టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయని, కొందరు మంత్రుల భార్యలు కూడా ముచ్చటపడి ఆస్తులు కొనుక్కున్నారంటూ గతంలో ప్రస్తావనకు వచ్చిందని జీవీఎల్ అన్నారు. అలాంటి వారి వివరాలను కూడా సీఐడీ బయటపెడుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.

‘హాయ్‌లాండ్‌పై లోకేష్ కన్ను’

అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఒకటైన హాయ్‌లాండ్‌పై మంత్రి లోకేష్ కన్నుపడిందని.. అందుకే దాని అమ్మకం విషయంలో జాప్యం జరుగుతోందని జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై తాను లోకేష్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి తాను బ్యాంకులకు లేఖ రాస్తానని, వేలం సరిగా వేసేలా చేయాలని తాను సీఐడీని కోరతానని జీవీఎల్ వివరించారు. ఆస్తుల అమ్మకం కుంభకోణంలో ఎవరున్నా జైలుకు వెళ్లక తప్పదని బీజేపీ ఎంపీ హెచ్చరించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2018, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading