HOME »NEWS »POLITICS »bjp mp gvl narasimha rao letter to cm ys jagan over lepakshi temple ba

GVL Letter to CM Jagan: ఆ ప్రఖ్యాత ఆలయానికి నష్టం కలిగించొద్దు: జీవీఎల్

GVL Letter to CM Jagan: ఆ ప్రఖ్యాత ఆలయానికి నష్టం కలిగించొద్దు: జీవీఎల్
జీవీఎల్ నరసింహారావు

అనంతపురం జిల్లాలోని హిందూపురం మీదుగా కోడికొండ చెక్‌పోస్ట్ నుంచి మడకసిర వరకు 4 లేన్లకు, రహదారిని వెడల్పు చేయడం మీద కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

  • Share this:
    BJP MP GVL Narasimha Rao | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం మీదుగా కోడికొండ చెక్‌పోస్ట్ నుంచి మడకసిర వరకు 4 లేన్లకు, రహదారిని వెడల్పు చేయడం మీద కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు కోసం లేపాక్షి గ్రామంలోని ప్రపంచ సాంస్కృతిక విలువ కలిగిన రక్షిత స్మారక కట్టడాలకు తీవ్ర హాని కలిగించడం సరి కాదన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త రహదారి గుండా వెళుతున్న భారీ వాహనాల నుంచి కాలుష్యం, కంపనం కారణంగా లేపాక్షి గ్రామం పురాతన కట్టడాలకు తీవ్రమైన, కోలుకోలేని నష్టం జరుగుతుందన్నారు. ఇది, చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ బసవన్న ఆలయాన్ని ఆనుకునే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారని అభ్యంతరం తెలిపారు. అలాగే, వీరభద్రస్వామి ఆలయం సమీపంలో నిర్మాణం చేపడుతున్నారన్నారు. దీనితో ప్రపంచ విఖ్యాత బసవన్న, వీరభద్రస్వామి ఆలయాలకు తీరని నష్టం జరగబోతోందని జీవీఎల్ ఆందోళన వ్యక్తం చేశారు. గొప్ప సాంస్కృతిక కట్టడాలైన ఈ రెండు దేవాలయాలను పురాతత్వ శాఖ జాగ్రత్తగా కాపాడుకుంటోందని జీవీఎల్ చెప్పారు. ఈ రోడ్డు వెడల్పులో చట్ట ఉల్లంఘనలను ఎత్తిచూపినప్పటికీ, లేపాక్షిలో రహదారి వెడల్పు ప్రణాళికలను మార్చలేదని విమర్శించారు. వైసీపీకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని జీవీఎల్ అన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించి  చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో జీవీఎల్ కోరారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:September 02, 2020, 17:23 IST