రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం... బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము ఎప్పుడో కోరామని జీవీఎల్ స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అమరావతిని కూడా రాజధాని అంటున్నారా? అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: January 21, 2020, 1:27 PM IST
రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం... బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
జీవీఎల్ నరసింహారావు
  • Share this:
రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. అయితే రాజధాని విషయంలో ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని... కేంద్రం అనుమతితోనే అంతా జరుగుతోందని వస్తున్న కథనాలు కల్పితాలే అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి అంటున్నారని.. తమ చేతకానితనాన్ని టీడీపీ కేంద్రంపై రుద్దాలని చూస్తోందా అని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని జీవీఎల్ విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయం బోగస్‌ విధానమన్నారు. అసెంబ్లీ ఉన్నంత మాత్రాన అమరావతి రాజధాని కాదని తెలిపారు.

రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము ఎప్పుడో కోరామని జీవీఎల్ స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అమరావతిని కూడా రాజధాని అంటున్నారా? అని ప్రశ్నించారు. ఇది కుటుంబ విధానం కాదని.. రాజ్యాంగ వ్యవస్థ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అని తేల్చిచెప్పారు. శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినా అమరావతిలో రాజధాని పెట్టారని వ్యాఖ్యానించారు. అమరావతిలో భూ అక్రమాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం... రేపటిలోగా వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు