చిల్లర రాజకీయాలు వద్దు చంద్రబాబు: బీజేపీ ఎంపీ జీవీఎల్

హైకోర్టు విభజనకు సంబంధించిన నోటిఫికేషన్ తమ ఘనతే అని రెండు రోజుల క్రితం చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు మాట మార్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబు సుప్రీంకోర్టును సైతం తప్పుదారి పట్టించారని మండిపడ్డారు.


Updated: December 29, 2018, 12:48 PM IST
చిల్లర రాజకీయాలు వద్దు చంద్రబాబు: బీజేపీ ఎంపీ జీవీఎల్
చంద్రబాబు నాయుడు, జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. హైకోర్టు విభజనకు సంబంధించిన నోటిఫికేషన్ తమ ఘనతే అని రెండు రోజుల క్రితం చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు మాట మార్చారని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబు సుప్రీంకోర్టును సైతం తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. చంద్రబాబుపై కోర్టు ధిక్కరణ కేసు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వెంటనే న్యాయాధికారులు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

ఏడు నెలల్లో కోర్టు భవనాలు కడతామని గతంలో చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ గుర్తు చేశారు. 12 నెలలు గడిచినా కోర్టు భవన కట్టలేకపోవడం చంద్రబాబు చేతగానితనం కాదా ? అని ప్రశ్నించారు. తన చేతగాని తనాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. ఏపీలో చేతగాని ప్రభుత్వం ఉందని ఆరోపించారు. చంద్రబాబు అవకాశవాదంతో మాట్లాడుతున్నారని... ఆయనకు ఓటమి భయం పట్టుకుంది జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఏపీ సీఎంకు మతిభ్రమించినట్టు తమకు అనుమానం కలుగుతోందన్న బీజేపీ ఎంపీ... గతంలో చంద్రబాబు అనేక అంశాలపై మాట మార్చారని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: December 29, 2018, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading