news18-telugu
Updated: December 28, 2018, 11:11 PM IST
చంద్రబాబు నాయుడు, జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్రం నుంచి నోటిఫికేషన్ రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు దానిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంతో సంప్రదించకుండానే కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
యూటర్న్ సీఎం అయిన చంద్రబాబు.. ఎప్పటిలాగే హైకోర్టు విభజన విషయంలోనూ ప్లేటు మార్చారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. విభజన చట్టాన్ని అనుసరించి కేంద్రం హైకోర్టు విభజనకు అనుమతిస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నిన్నటికి నిన్న టీడీపీ ఎంపీ కె.రవీంద్ర కుమార్ హైకోర్టు విభజన తమ క్రెడిటే అని డబ్బా కొట్టుకున్నారని గుర్తుచేశారు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ మీ 'బతుకులు చెడ' అని ఊరికే అనలేదని విమర్శించారు.ఇక విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో రద్దుపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేస్తున్న విమర్శలను కూడా జీవీఎల్ తిప్పికొట్టారు. చచ్చు డ్రామాలు ఆపేస్తే మంచిదని, దొంగ డ్రామాలు వద్దని విమర్శించారు.
Published by:
Srinivas Mittapalli
First published:
December 28, 2018, 9:03 PM IST