news18-telugu
Updated: August 8, 2019, 2:57 PM IST
ఏపీ సీఎం జగన్(File)
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తరహాలోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. గతంలో సాధ్యం కావు అని చెప్పిన అంశాలనే జగన్ ప్రభుత్వం మళ్ళీ అడగటం విడ్డూరంగా ఉందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి సాధ్యం కావు అని చెప్పిన అంశాలే జగన్కు కూడా వర్తిస్తాయని జీవీఎల్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలు సమయం ఇచ్చి ప్రభుత్వ పనితీరుపై స్పందిస్తామని అన్నారు. లిఖిత పూర్వకంగా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే పోర్టు పనులు ప్రారంభం అవుతాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ ప్రజల్ని ఓట్లు కోసం వాడుకుందని ఆయన విమర్శలు గుప్పించారు. రాజకీయాలను పక్కన పెట్టి ఆర్టికల్ 370 బిల్లుకి చాలా పార్టీలు సహకారం అందించాయని...ఇది గొప్ప విషయమని జీవీఎల్ అన్నారు. ఎన్ఎంసీ బిల్లు విషయంలో అపోహలు వద్దని, బిల్లు విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే చర్చల ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోదని జీవిఎల్ తేల్చిచెప్పారు.
Published by:
Kishore Akkaladevi
First published:
August 8, 2019, 2:57 PM IST