news18-telugu
Updated: December 30, 2019, 5:54 PM IST
ప్రతీకాత్మక చిత్రం
రాజధాని తరలింపు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాజధాని తరలింపు అంశంలో కేంద్రం జోక్యం ఉండదని ఆయన వ్యాఖ్యనించారు. రాజధానిని మార్చాలని కేంద్రం చెప్పదని... ఈ విషయంలో ఏవైనా సూచనలు అడితే కేంద్రం ఇస్తుందని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని తాను గతంలోనూ చెప్పానని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి చాలామంది ఎంపీలు ఉన్నారని... కానీ ఈ విషయంలో బీజేపీ అధికార ప్రతినిధి అయిన తాను చెప్పిందే ఫైనల్ అని జీవీఎల్ నరసింహరావు అన్నారు. దీనిపై తమ పార్టీ నేతలు ఎవరు ఏది మాట్లాడిన అది వారి వ్యక్తిగతమే అంటూ పరోక్షంగా సుజనా చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా మార్చడం సాధ్యంకాదని సుజనా చౌదరి వ్యాఖ్యానించిన ఒక్క రోజుకే జీవీఎల్ దీనిపై ఈ రకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published by:
Kishore Akkaladevi
First published:
December 30, 2019, 5:54 PM IST