తెలంగాణ టీడీపీని టెన్షన్ పెడుతున్న బీజేపీ ఎంపీ ?

తెలంగాణలోని టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చి బాధ్యతలను టీడీపీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్ రావు తీసుకున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 17, 2019, 5:34 PM IST
తెలంగాణ టీడీపీని టెన్షన్ పెడుతున్న బీజేపీ ఎంపీ ?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
తెలంగాణలో ఇప్పటికే బలహీనంగా ఉన్న టీ టీడీపీని వీడేందుకు అనేక మంది నేతలు సిద్ధమవుతున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ వంటి నాయకులు పార్టీని నమ్ముకుని ఉన్నా... చాలామంది ఇతర నాయకులు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరగబోయే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బహిరంగ సభలో అనేక మంది టీటీడీపీ నేతలు బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని అనేక జిల్లాలకు చెందిన టీడీపీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఇప్పటికే టీడీపీని వీడబోతున్నట్టు ప్రకటించారు. వీరంతా జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరడం దాదాపు లాంఛనమే అనే తెలుస్తోంది.

అయితే తెలంగాణలోని టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చి బాధ్యతలను టీడీపీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్ రావు తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీలో ఉన్న నాయకులందరినీ బీజేపీ వైపు తీసుకొచ్చే బాధ్యతలను ఆ పార్టీ అధినాయకత్వం గరికపాటికి అప్పగించినట్టు సమాచారం. ఈ కారణంగానే కొద్దిరోజుల నుంచి ఆయన తెలంగాణలోని అనేక మంది టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను కలిసి చర్చలు జరుపుతున్నారు.

Garikapati attracting tdp leader to bjp, garikapati mohan rao, bjp mp garikapati, telangana tdp, ttdp, trs, congress, bjp, chandrababu naidu, telangana politics, jp nadda, amit shah, టీటీడీపీ నేతలను ఆకర్షిస్తున్న గరికపాటి, గరికపాటి మోహన్ రావు, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డా
గరికపాటి మోహన్ రావు(ఫైల్ ఫోటో)


బీజేపీలోకి వస్తే తగిన గుర్తింపు ఉంటుందని ఆయన వారికి ప్రత్యేకంగా హామీ ఇస్తున్నట్టు టాక్. కొందరు నేతలకు బీజేపీలోని ముఖ్యనాయకులతో హామీ ఇప్పిస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా అనేక మంది టీడీపీ నేతలను జేపీ నడ్డా సమక్షంలో టీడీపీలోకి తీసుకురావాలని భావిస్తున్న ఎంపీ గరికపాటి... ఆ తరువాత మిగతా వారిని వచ్చే నెలలో అమిత్ షా సమక్షంలో పార్టీలోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ టీడీపీని ఆ పార్టీలో ఎదిగిన నాయకుడే టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: August 17, 2019, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading