అందుకే ఆ ఎన్నికలు పెట్టడం లేదు... కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ విమర్శలు

టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గద్దె దిగే రోజు దగ్గరలోనే ఉందని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు.

news18-telugu
Updated: November 11, 2019, 6:36 PM IST
అందుకే ఆ ఎన్నికలు పెట్టడం లేదు... కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ విమర్శలు
కేసీఆర్, ధర్మపురి అరవింద్ (ఫైల్ ఫోటో)
  • Share this:
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ భూములు అమ్ముకుందామని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్‌లో జరుగుతున్న ఆర్టీసీ దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎంపీ అరవింద్... వారికి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ హోల్ సేల్‌గా ఎమ్మెల్యేలు రిటైల్‌గా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన కుటుంబం మీద చూపించే ప్రేమలో ఐదు శాతమైనా ఆర్టీసీ మీద చూపించాలని కోరారు. సీఎం కేసీఆర్ అహంకార ప్రకటన వల్లే ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకున్నారని విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గద్దె దిగే రోజు దగ్గరలోనే ఉందని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు. ఆయన ఎన్ని రోజులు నియతృత్వ పాలన నడిపిస్తాడో చూద్దామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందని... ఇప్పటికే ఆయన విపరీత పాపాలు చేశారని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని... త్వరలోనే కార్మికులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని చెప్పారు.

First published: November 11, 2019, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading