తమిళనాడులోనూ ‘కాశ్మీర్’ ఎఫెక్ట్... బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

లడఖ్ ఎంపీ మాట్లాడితే దేశమంతా చూసిందని... దీన్ని బట్టి మోదీ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. తాను బీజేపీలో బాగా పని చేస్తున్నానని స్వయంగా ఆ పార్టీ నేతలే ప్రశంసిస్తున్నారని సీఎం రమేశ్ చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: August 11, 2019, 4:50 PM IST
తమిళనాడులోనూ ‘కాశ్మీర్’ ఎఫెక్ట్... బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీ జెండా
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే తమిళనాడులోని వేలూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీగా ఓట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని అంతా భావించారని... కానీ కాశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ కేవలం 8 వేల ఓట్ల మెజార్టీతో విజంయ సాధించిందని సీఎం రమేశ్ అన్నారు. లడఖ్ ఎంపీ మాట్లాడితే దేశమంతా చూసిందని... దీన్ని బట్టి మోదీ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. తాను బీజేపీలో బాగా పని చేస్తున్నానని స్వయంగా ఆ పార్టీ నేతలే ప్రశంసిస్తున్నారని సీఎం రమేశ్ చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా తమను బీజేపీలోకి పంపించారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో అధికార వైసీపీకి మరికొంత సమయం ఇచ్చిన తరువాతే స్పందిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత సహా అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎం రమేశ్ సూచించారు. భవిష్యత్తుల్లో టీడీపీ నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరతామని... తనతో చాలామంది టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. ఏపీలో బీజేపీ బలపడేందుకు సానుకూల వాతావరణం ఉందని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.


First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>