Home /News /politics /

BJP MP ARVIND SLAMS TELANGANA HOME MISTER MAHMOOD ALI SK

హోంమంత్రి డమ్మీ.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

హోంమంత్రి మహమూద్ అలీపై బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డమ్మీ హోంమంత్రి.. అలాంటి నేతలను కేబినెట్‌లో ఎందుకు చేర్చుకున్నారని విరుచుకుపడ్డారు.

  దిశా కేసులో ఇటీవల తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన చెల్లికి ఫోన్ చేసే బదులు పోలీసులకు చేయాల్సిందన్న ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలిదే తప్పు అన్నట్లుగా మాట్లాడారని దిశా పేరెంట్స్, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. దాంతో మళ్లీ స్పందించిన ఆయన.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. దిశా తనకు కూతురులాంటిదని.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీపై బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డమ్మీ హోంమంత్రి.. అలాంటి నేతలను కేబినెట్‌లో ఎందుకు చేర్చుకున్నారని విరుచుకుపడ్డారు.

  తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ డమ్మీ. దిశా కేసును వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నానని కేటీఆర్ చెబుతున్నాడంటే హోంమంత్రి దద్దమ్మనా? లేదంటే ఇదేమైరా రాచరికమా? కేబినెట్‌లో డమ్మీలను ఎందుకు పెట్టుకున్నారు. కేసీఆర్ కళ్లునెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కు కేబినెట్ సమావేశం నిర్వహించే తీరిక లేదు.
  ధర్మపురి అరవింద్, ఎంపీ


  అటు ఆర్టీసీ విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు అరవింద్. మీటింగ్‌లో ఉన్న సోయి సమ్మె కాలంలో ఏమైందని నిప్పులు చెరిగారు. మొన్నటి దాకా ఆర్టీసీ కార్మికులు పనికిరారన్న కేసీఆర్.. మళ్లీ ఏ మొహం పెట్టుకొని విధుల్లోకి తీసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు అరవింద్. అటు 30 మంది ఆర్టీసీ కార్మికులు, 100 మంది ప్రయాణికుల చావులకు కేసీఆర్ కారణమయ్యారని ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు తానే సమస్యను పరిష్కరించాననే నీచ స్థితిలో సీఎం ఉన్నారని విమర్శించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Dharmapuri Arvind, Disha murder case, Telangana

  తదుపరి వార్తలు