జగన్ మెప్పు కోసం బీజేపీ ఎంపీ ప్రయత్నాలు ?

పార్టీపరంగా బీజేపీ వైఖరి ఎలా ఉన్నా... ప్రస్తుతం ఆ పార్టీ ఎంపీగా ఉన్న టీడీపీ మాజీ నేత సీఎం రమేశ్... జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

news18-telugu
Updated: December 24, 2019, 12:11 PM IST
జగన్ మెప్పు కోసం బీజేపీ ఎంపీ ప్రయత్నాలు ?
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం జగన్, బీజేపీ మధ్య ఉన్నది మిత్రుత్వమా ? లేక శత్రుత్వమా ? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఢిల్లీ పెద్దలతో సఖ్యతగానే ఉంటూ వస్తున్న సీఎం జగన్... వారి నిర్ణయాలను వ్యతిరేకించే విషయంలో మాత్రం అస్సలు వెనుకాడటం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీపరంగా బీజేపీ వైఖరి ఎలా ఉన్నా... ప్రస్తుతం ఆ పార్టీ ఎంపీగా ఉన్న టీడీపీ మాజీ నేత సీఎం రమేశ్ జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కోసం వచ్చిన సీఎం జగన్‌ను ఏకంగా హెలీప్యాడ్ దగ్గరకు వెళ్లి మరీ రిసీవ్ చేసుకున్నారు సీఎం రమేశ్.

ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయనతో అంతే అభిమానంగా మాట్లాడారు. ఇది చూసిన వైసీపీ నేతలు... ఎంపీ సీఎం రమేశ్ తీరు చూసి ఆశ్చర్యపోయారు. అయితే బీజేపీ ఎంపీ జగన్‌ దృష్టిలో పడేందుకు ఇంతలా ప్రయత్నించడానికి వేరే కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తన కంపెనీలకు సంబంధించి పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయని... వాటి మంజూరు కోసమే ఆయన సీఎం జగన్‌ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Ap cm ys jagan, kapada steel plant, mp cm Ramesh
సీఎం జగన్‌కు ఎంపీ ఎంపీ సీఎం రమేశ్ స్వాగతం(ఫైల్ ఫోటో)


అయితే సీఎం రమేశ్ సన్నిహితులు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. గతంలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆయన దీక్ష చేశారని... తన కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారనే కారణంగానే ఆయన ఇలా చేశారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఎంపీ సీఎం రమేశ్‌ను జగన్ అంత ఈజీగా నమ్మరనే టాక్ వినిపిస్తోంది.

First published: December 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు