చంద్రబాబు అవన్నీ మర్చిపోయారా ?.. బీజేపీ ఎమ్మెల్సీ విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 17, 2019, 12:03 PM IST
చంద్రబాబు అవన్నీ మర్చిపోయారా ?.. బీజేపీ ఎమ్మెల్సీ విమర్శలు
చంద్రబాబు (File)
news18-telugu
Updated: October 17, 2019, 12:03 PM IST
ప్రధాని నరేంద్రమోదీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని... ఎన్నికలకు ముందుకు కేంద్రంతో విభేదించి తప్పు చేశామని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు స్పందించారు. తెనాలిలో గాంధీజీ సంకల్ప యాత్రలో పొల్గొనేందుకు వచ్చిన సోము వీర్రాజు... చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. మోదీ మెడలు వంచుతాను అన్నది నిజంకాదా ? అని అన్నారు.

ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ, గల్లా జయదేవ్‌తో మోదీపై విమర్శలు చేయించారని అన్నారు. మిస్టర్ మోదీఅని గల్లా జయదేవ్ అనలేదా ? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు మోదీ పవిత్ర జలాలు తీసుకొస్తే లక్ష కోట్ల రూపాయలు ఇస్తారని అనుకున్నారని చంద్రబాబు అనలేదా అని అన్నారు. టీడీపీతో పొత్తులో ఉన్నపుడు వామపక్షాలు మోదీ దిష్టి బొమ్మను తగలపేడుతునప్పుడు ఎందుకు ఖండించలేదని చంద్రబాబును ప్రశ్నించారు. బీజేపీతో పొట్టుకుని తమ మీదే చంద్రబాబు రెబల్స్‌ను నిలబెట్టారని సోము వీర్రాజు అన్నారు. ఇవన్నీ చంద్రబాబు ఎలా మరిచిపోయారని ఎద్దేవా చేశారు.


First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...