Home /News /politics /

BJP MLAS AUDIO CLIP ROCKS KARNATAKA POLITICS SAYING DEVE GOWDA WILL DIE SOON AND JDS TO BECOME HISTORY AK

దేవేగౌడ త్వరలోనే చనిపోతారు... కుమారస్వామి పరిస్థితి అంతే... కర్ణాటకలో ఆడియో టేపు కలకలం

దేవేగౌడతో కుమారస్వామి(PTI Image)

దేవేగౌడతో కుమారస్వామి(PTI Image)

బీజేపీ నేత జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు... జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడది చెప్పుకుంటున్న తాజా ఆడియో టేపులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    కర్ణాటకలో కొద్దిరోజుల నుంచి ఆడియో టేపుల కలకలం కొనసాగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బేరసారాలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియోలను ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు విడుదల చేయడంతో ఈ దుమారం మొదలైంది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో టేపు... జేడీఎస్ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హసన్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడది చెప్పుకుంటున్న తాజా ఆడియో టేపులోని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

    త్వరలోనే మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ చనిపోతారని... ఆయన కుమారుడు కుమారస్వామి ఆరోగ్యం కూడా పెద్దగా బాగోలేదని ఆ ఆడియో టేపులో రికార్డ్ అయ్యింది. అంతేకాదు త్వరలోనే జేడీఎస్ ఓ చరిత్రగా మిగిలిపోతుందని ఆడియో టేపులో వాయిస్‌లో ఉంది. దీన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో... జేడీఎస్ కార్యకర్తలు రగిలిపోయారు. హసన్ జిల్లాలోని ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే తనను చంపేందుకు జేడీఎస్ ప్రయత్నిస్తోందని ప్రీతమ్ గౌడ ఆరోపించారు. అయితే ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి కుమారస్వామి... జేడీఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. మొత్తానికి కర్ణాటక రాజకీయాలను ఆడియో టేపులు కుదిపేయడం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.




    First published:

    Tags: Bjp, Congress, Deve gowda, Jds, Karnataka, Kumaraswamy, Yeddyurappa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు