Home /News /politics /

BJP MLA T RAJA SINGH CALLS SANIA MIRZA PAKISTANS BAHU SB

సానియా పాకిస్థాన్ కోడలు... తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వద్దు: రాజాసింగ్

సానియా మిర్జా, ఎమ్మెల్యే రాజా సింగ్

సానియా మిర్జా, ఎమ్మెల్యే రాజా సింగ్

మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూల్వామా దాడుల నేపథ్యంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాను తొలగించాలని డిమాండ్ చేశారు.

    హైదారబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంబాసిడర్‌గా ఉన్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తప్పించాలని సీఎం కేసీఆర్‌కు ఆయన విజ్ఙ‌ప్తి చేశారు. పాకిస్థాన్‌కు కోడలు కాబట్టి సానియాను అంబాసిడర్‌గా తొలగించి, ఆ స్థానంలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, లేదా వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌ను సానియా పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. అయితే ప్రస్తుతం పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి భారత్ - పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పాక్ కోడలైన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా

    Sania Mirza - Shoaib Malik
    షోయబ్ మాలిక్, సానియా మీర్జా ( Sania Mirza / Instagram )


    తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు.

    తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి, ప్రయోజనాలను సానియా మిర్జా ప్రమోట్ చేసేందుకు కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ అధికార ధ్రువీకరణ పత్రంతోపాటుకోటి రూపాయల చెక్ అందించారు. సానియా అసలు సిసలైన హైదరాబాదీ కావడం తెలంగాణకు గర్వకారణం అని కేసీఆర్ అప్పట్లో సానియాను కొనియాడారు. సానియా మిర్జాకు 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బహుకరించింది. సానియాకు కేంద్రం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కూడా ప్రకటించింది.

    First published:

    Tags: Bjp, Sania Mirza, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు