జార్జి రెడ్డి సినిమా యూనిట్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్..
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే కోవలో ఒకప్పటి ఓయూ విద్యార్ధి నాయకుడు ‘జార్జి రెడ్డి’ జీవిత చరిత్రపై ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాపై రాజా సింగ్ స్పందించారు.
news18-telugu
Updated: November 19, 2019, 7:04 PM IST

జార్జి రెడ్డి సినిమాపై రాజా సింగ్ స్పందన (File Photo)
- News18 Telugu
- Last Updated: November 19, 2019, 7:04 PM IST
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే కోవలో ఒకప్పటి ఓయూ విద్యార్ధి నాయకుడు ‘జార్జి రెడ్డి’ జీవిత చరిత్రపై ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే ఈ బయోపిక్ పై వివాదం మొదలైంది. ఈ సినిమాను ఒక వర్గానికి సంబంధించిన వాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జార్జిరెడ్డి తన ఆధిపత్యానికి అడ్డుగా ఉన్న ఏబీవీపీ విద్యార్ధి నాయకులైన ఎంతో మందిని మందిని పొట్టనపెట్టుకున్నాడనే ఆరోపణలున్నాయి. తాజాగా ఈ సినిమా విషయమై ఎమ్మెల్యే రాజా సింగ్ ‘జార్జి రెడ్డి’చిత్రంపై స్పందించారు. ఈ సినిమాను వాస్తవాలను వక్రీకరించి టోటల్‌గా వన్ సైడ్‌గా తెరకెక్కించినట్టు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందన్నారు. సినిమా ముసుగులో హిందూ సంస్థలపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అంతేకాదు ఈ సినిమాను అడ్డుపెట్టుకొని ఏబీవీపీని కించపరిస్తే సహించేది లేదన్నారు. అలా చేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నారు.

ఇక జార్జిరెడ్డి హత్య జరిగిన టైమ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఐతే ఈ సినిమాలో మాత్రం జార్జి రెడ్డిని ఏబీవీపీ చెందిన వ్యక్తులే హత్య చేశారన్నట్టుగా వక్రీకరించి తెరకెక్కించినట్టు చూపించారన్నారు. నిజాలని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే.. ఎవరికిీ అభ్యంతరం లేదు. ఒకవేళ వక్రీకరించి సినిమాను తెరకెక్కిస్తే మాత్రం.. ఖచ్చితంగా మా రియాక్షన్ ఉంటుదని హెచ్చరించారు. అంతేకాదు ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను కూడా తొలిగించాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేసారు. అసలు ఇలాంటి సినిమాలకు సెన్సార్ వాళ్లు ఎలా అనుమతులు ఇస్తారని మండిపడ్డారు. మొత్తానికి జార్జి రెడ్డి సినిమా విడుదలకు ముందు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

‘జార్జ్ రెడ్డి’ పాత్రలో సాండీ (ఇన్స్టాగ్రామ్ ఫోటోస్)

Loading...