హోమ్ /వార్తలు /రాజకీయం /

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హౌస్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హౌస్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

నిన్న రాత్రి భైంసాలో మతపరమైన హింస జరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

    హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాత్రి నుంచి రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీస్ ఉన్నతాధికారులకు సైతం గాయాలయ్యాయి. జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు 2 బెటాలియన్ల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని నిర్మల్ జిల్లాకు పంపారు. నిన్న రాత్రి భైంసాలో మతపరమైన హింస జరిగిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పట్టణంలో రెండు వర్గాల ప్రజలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో నిర్మల్ ఎస్పీ శశిదాహర్ రాజు, డీఎస్పీ నర్సింగ్ రావు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్ రావు ఉన్నారు.ప్రస్తుతం భైంసాలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అంతేకాకుండా నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. తమ ఆదేశాలు ధిక్కరించి ఎవరు బయట తిరిగినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Bjp, Hyderabad, Raja Singh, Telangana

    ఉత్తమ కథలు