Raja Singh: నేను అందుబాటులో లేను.. అసెంబ్లీ వాయిదా వేయాలి..

బీజేపీకి తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే. ఉన్నఫళంగా అసెంబ్లీ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

news18
Updated: October 12, 2020, 5:33 PM IST
Raja Singh: నేను అందుబాటులో లేను.. అసెంబ్లీ వాయిదా వేయాలి..
రాజాసింగ్ (ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: October 12, 2020, 5:33 PM IST
  • Share this:
‘నేను అందుబాటులో లేను కాబట్టి ప్రభుత్వం నిర్వహిస్తోన్న అసెంబ్లీ సమావేశాలు వారం రోజులు వాయిదా వేయాల’ని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. ప్రస్తుతం తాను రాజస్థాన్, ఉత్తరా ఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానని ఆయన అన్నారు. అయినా ఇంత సడెన్ గా అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది..? అని అయన ప్రశ్నించారు. గతంలో మునిసిపల్ యాక్ట్ లో మీరే (టీఆర్ఎస్ ప్రభుత్వం) సవరణలు చేశారని, ఇప్పుడు మళ్ళీ చేస్తామని అంటున్నారని ఆయన అన్నారు. మీ మీద మీకే నమ్మకం లేదా ? అంటూ విమర్శలు చేశారు. ఎంఐఎంకి లాభం చేకూర్చేందుకే ఈ సవరణలు అని తెలిసిందని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.

బీజేపీకి ఉన్న సభ్యుడిని తానొక్కణ్ణే కాబట్టి అన్ని పార్టీలకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అసెంబ్లీ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ తో పాటు దేశంలోని  పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కృషి చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Ghmc Elections, Ghmc news, Telangana assembly, telangana cm, Telangana election commision
తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఫోటో)


ఇక ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించే శాసనసభ, శాసనపరిషత్ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పరిశీలించారు. సభలో సభ్యుల మద్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.

కాగా, కొద్ది రోజుల్లో హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు శాసనసభా సమావేశాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో పలు బిల్లుల సవరణ తో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజు తగ్గిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Published by: Srinivas Munigala
First published: October 12, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading