హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో మొదలైన వేడి ఇంకా తగ్గడం లేదు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో దూకుడు మీద ఉన్న తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధికార టీఆర్ఎస్ పార్టీకి (TRS Party) వరుసగా షాక్ లు ఇచ్చేందుకు స్కెచ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీలోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ను తమ వైపు తిప్పుకోవడంలో కమల దళం సక్సెస్ అయ్యింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిత్వం ఆశించిన అనేక మందికి అవకాశం దక్కకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి తమ పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాపై (Kammaam District) బీజేపీ ఫోకస్ చేసనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ తమకు టచ్ లో ఉన్నారని.. చర్చలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆ మాజీ మంత్రి, మాజీ ఎంపీ తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి గత కొంత కాలంగా టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
MLC Elections: అనుకున్నంత ఈజీ కాదట.. స్థానిక ఎమ్మెల్సీ గెలుపుపై తెరాసలో అంతర్మథనం.. కారణం ఇదే..
వారి ప్రత్యర్థులను పార్టీలోకి తీసుకోవడంతో పాటు ఎలాంటి పదవులు దక్కకపోవడంతో ఈ ఇరువురు నేతలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు చేసిన వాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూర్చుతున్నాయి. ఇదిల ా ఉంటే.. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం కాషాయ కండువ కప్పుకోవడం ఖరారైనట్లే అని తెలుస్తోంది.
KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?
జనవరిలో ఆయన ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇటీవల మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. అసంబ్లీలో తమకు మరో ‘ఆర్’ జత కానుందని ఆయన చెప్పడంతో రాజగోపాల్ రెడ్డి చేరిక కన్ఫామ్ అని తెలుస్తోంది. అయితే ఆయన ఎప్పుడు బీజేపీలో చేరుతారన్న విషయంపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kcr, Khammam, Raghunandan rao, Telangana bjp, Telangana Politics, Trs