హోమ్ /వార్తలు /politics /

KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

ఈటల రాజేందర్, కేసీఆర్( ఫైల్ ఫోటో )

ఈటల రాజేందర్, కేసీఆర్( ఫైల్ ఫోటో )

Etela Rajendar: టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చే విషయంలో ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్‌పై రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తన ఓటమి కోసం పని చేసిన టీఆర్ఎస్ నేతల నియోజకవర్గాల్లో తాను కూడా పర్యటిస్తానని ఆయన గతంలోనే చెప్పారు. ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చే విషయంలో ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోనే ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఆయన పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ భానుప్రసాద్ రావుకు ఛాన్స్ ఇచ్చింది.

అయితే ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్.. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. ఆయన పోటీ నుంచి తప్పుకుంటారని చాలామంది భావించారు. కానీ ఆయన వెనుక మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారనే విషయంపై టీఆర్ఎస్ ఓ క్లారిటీకి వచ్చిందని.. దీంతో ఈ ఎన్నికను పార్టీ కీలకంగా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఈటల రాజేందర్‌కు కొంతమేర పట్టు ఉంది. ఈ కారణంగానే ఆయన రవీందర్ సింగ్‌ను ఇండిపెండెంట్‌గా బరిలోకి దింపారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రవీందర్ సింగ్.. ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇది టీఆర్ఎస్‌ను మరింతగా టెన్షన్ పెడుతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈటల రాజేందర్ సూచన మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రవీందర్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లారని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

రవీందర్ సింగ్‌ ద్వారా టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకున్నారని.. ఆయనకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. రవీందర్ సింగ్‌ను కచ్చితంగా గెలిపించుకుంటామని నమ్మకం ఏమీ లేకపోయినా.. ఈ రకంగా టీఆర్ఎస్‌కు మరోసారి తన సత్తా చాటాలనే యోచనలో మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

మరోవైపు ఈటల రాజేందర్ గేమ్ ప్లాన్ గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం.. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించే బాధ్యతను జిల్లా మంత్రులు కమలాకర్, ఈశ్వర్‌తో పాటు పలువురు నేతలకు అప్పగించినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ నేతలు రంగంలోకి దిగి స్థానిక నాయకులు తమ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారని జిల్లాలో ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి కరీంనగర్‌లో కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్న ఈటల రాజేందర్.. ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

First published:

Tags: CM KCR, Etela rajender, Karimnagar, Trs

ఉత్తమ కథలు