వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి… జేడీయూ ఎఫెక్ట్ ?

బీహార్‌లో జేడీయూ తమకు దూరమైతే... ఆ స్థానాన్ని వైసీపీతో భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా వైసీపీకి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసేందుకు బీజేపీ ముందుకొచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

news18-telugu
Updated: June 11, 2019, 6:46 PM IST
వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి… జేడీయూ ఎఫెక్ట్ ?
నరేంద్రమోదీ, జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్రంలో బీజేపీతో ప్రస్తుతానికి స్నేహంగానే ఉండాలని డిసైడయిన వైసీపీ... ఆ పార్టీకి మరింతగా దగ్గరయ్యే అవకాశం లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎన్డీయే నుంచి జేడీయూ దూరం జరగనుందనే ప్రచారం జరుగుతోంది. బీహార్‌లో జేడీయూ తమకు దూరమైతే... ఆ స్థానాన్ని వైసీపీతో భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా వైసీపీకి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసేందుకు బీజేపీ ముందుకొచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు కేటాయించింది బీజేపీ. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే తాజాగా ఏపీలోని వైసీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ ఈ పదవిని స్వీకరిస్తారా... తీసుకుంటే ఇందుకు ఎవరి పేరును ఖరారు చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.


First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...