బీజేపీకి వచ్చే సీట్లు సంఖ్య ఇదే... చంద్రబాబు లెక్క

అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాకూడదని బలంగా కోరుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు... మరోసారి నరేంద్రమోదీ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు తన సర్వశక్తులను ఒడ్డుతున్నారు.

news18-telugu
Updated: April 23, 2019, 8:02 AM IST
బీజేపీకి వచ్చే సీట్లు సంఖ్య ఇదే... చంద్రబాబు లెక్క
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 23, 2019, 8:02 AM IST
లోక్ సభ ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయనే వాదనను పలువురు ప్రాంతీయ పార్టీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో చక్రం తిప్పబోయేది తామే అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాకూడదని బలంగా కోరుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు... మరోసారి నరేంద్రమోదీ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు తన సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ, యూపీఏ పక్షాలకు అనుకూలంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి సైతం వెళుతున్నారు చంద్రబాబు.

ఈ క్రమంలోనే మరోసారి బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదని ఏపీ ముఖ్యమంత్రి బలంగా నమ్ముతున్నట్టు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన అంచనా ప్రకారం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లకు మించి రావని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. టీడీపీ తరపున అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు... ఏపీలో పోలింగ్ సరళితో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు.

బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని ఓ ముఖ్యనేత అడగ్గా... వారికి ఈ సారి కేంద్రంలో 160 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. సర్వేల ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పార్టీ నేతలకు వివరించిన చంద్రబాబు... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీకి కేంద్రంలో 160 సీట్లకు మించి రావని భావిస్తున్న చంద్రబాబు అంచనాలు ఎంతమేరకు నిజమవుతాయో చూడాలి.First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...