• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BJP MAY LEAVE TIRUPATI SEAT FOR JANASENA IN UPCOMING BY ELECTION IN ANDHRA PRADESH GOOD NEWS FOR PAWAN KALYAN AK

Janasena-Bjp: ఏపీలో జనసేనకు బీజేపీ గుడ్ న్యూస్ చెబుతుందా ?

Janasena-Bjp: ఏపీలో జనసేనకు బీజేపీ గుడ్ న్యూస్ చెబుతుందా ?

పవన్ కళ్యాణ్, అమిత్ షా (ఫైల్ ఫోటో)

Janasena-Bjp: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ కంటే జనసేన మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో ఏపీలో బీజేపీ కంటే తమకే ఎక్కువ బలం ఉండటంతో పాటు పరిస్థితులు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని జనసేన ఈ సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  • Share this:
    పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కేంద్రం ఎన్నికల సంఘం.. మిగతా రాష్ట్రాల్లోని స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు వేరుగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏప్రిల్ 6నే తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ, జనసేన ఇంకా అవగాహనకు రాని సంగతి తెలిసిందే. మార్చి మొదటి వారంలో అమిత్ షా తిరుపతి వస్తారని.. అప్పుడు దీనిపై స్పష్టత వస్తుందని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో తెలిపారు. అయితే తిరుపతిలో జనసేన అభ్యర్థి బరిలో ఉండాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. తమ అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ నేతలు గతంలో ప్రకటించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తిరుపతిలో జనసేన అభ్యర్థి బరిలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది.

    ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు ప్రధాన కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమే అని తెలుస్తోంది. ఏపీ ప్రజలకు సెంటిమెంట్ అయిన విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించే విషయంలో కేంద్రం ఏ మాత్రం వెనక్కి తగ్గదని ప్రధాని మోదీ వ్యాఖ్యలను బట్టి అర్థమైంది. ఈ అంశంపై ఏం చెప్పాలో ఏపీ బీజేపీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో తమ అభ్యర్థి బరిలో ఉంటే ఈ అంశంపై వ్యతిరేకత వస్తుందనే భావనలో ఆ పార్టీ నేతలను ఉన్నట్టు తెలుస్తోంది.

    ఇక ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ కంటే జనసేన మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో ఏపీలో బీజేపీ కంటే తమకే ఎక్కువ బలం ఉండటంతో పాటు పరిస్థితులు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని జనసేన ఈ సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న బీజేపీ నాయకత్వం.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీలో ఉంటే.. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు