news18-telugu
Updated: November 27, 2020, 5:17 PM IST
జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు (GHMC ELections) భారతీయ జనతా పార్టీ (BJP) రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో (BJP Manifesto)లో ఓ పథకం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సారధ్యంలో అమలు చేస్తున్న పథకాన్ని పోలి ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఆటోల రిపేర్లు, ఇతర అవసరాల కోసం ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.7000 సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే, ఆటో డ్రైవర్లకు ప్రమాదబీమా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ పథకం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది. వైఎస్ఆర్ వాహనమిత్ర (YSR Vahana Mitra) పేరుతో తీసుకొచ్చిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.10,000 సాయం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా వారికి చెల్లింపులు కూడా చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్లైన్ చెల్లింపులు చేశారు.
AP Cabinet: నివర్ తుఫాన్ బాధితులకు డబ్బులు.. వారందరికీ ఇవ్వాలన్న సీఎంRaghavendra Rao: హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్రరావు, నలుగురు హీరోయిన్లు..
జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు
- సిటీ బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అంత మేర రాయితీని జీహెచ్ఎంసీ చెల్లిస్తుంది.
- ప్రతి కిలోమీటర్‌కు మహిళలకోసం ఓ టాయిలెట్
- మహిళలకు భద్రత. కొత్తగా 15 మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు
- ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీరు. నల్లా లేని ఇంటికి ఉచితంగా కనెక్షన్. ప్రతి రోజూ నీటి సరఫరా
- సెలూన్లు, దోబీఘాట్లు, ఫుట్ వేర్, నేతన్నలు, పరిమిత సంఖ్యలో గేదెలు, కోళ్ల పెంపకం చేపట్టే వారికి ఉచిత విద్యుత్, ఉచిత నల్లా నీరు
- సెలూన్లకు సున్నా వడ్డీతో ఏటా రూ.15000 రుణం
- ఎస్సీ కాలనీలు, మురికివాడల్లో ఆస్తిపన్ను పూర్తిగా మాఫీ
- ద్విచక్రవాహనాలు, ఆటోలపై ఇప్పటి వరకు పెనాల్టీ చలాన్లు రద్దు
- అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, ఫ్రీ వైఫై
- 125 గజాల్లో ఇంటి నిర్మాణాలకు ఎలాంటి పరిమితులు అవసరం లేదు
- ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ
- జీహెచ్ఎంసీ కార్మికులకు వేతన సవరణ
సుప్రీంకోర్టులో జగన్‌కు డబుల్ బొనాంజా.. మరో గుడ్ న్యూస్
గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ
Tirupati ByPolls: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇస్తున్న బీజేపీ, తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు?
అయితే, బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో తమను కాపీ కొట్టిందని అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. బీజేపీ మేనిఫెస్టోలో వాడిని ఫొటోలు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్దికి సంకేతాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు మహిళలకు మెట్రోలు, బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది కూడా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్నదేనని చెబుతున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 27, 2020, 4:57 PM IST