GHMC Elections 2020 | BJP Manifesto: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీద టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీద టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో హైదరాబాద్కు నలువైపులా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే, హైదరాబాద్ నగరంలో మహిళా పోలీస్ స్టేషన్లు, కిలోమీటర్ దూరానికి ఓ మహిళా టాయిలెట్ లాంటివి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే, ఆ మేనిఫెస్టో రూపొందించేందుకు వినియోగించిన ఫొటోలు ఇప్పుడు టీఆర్ఎస్కు ఆయుధంగా మారాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు సంబంధించి ఫొటోలను ఆ మేనిఫెస్టోలో వినియోగించారంటూ టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీని ట్రోల్ చేస్తున్నారు. పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి అనే ట్విట్టర్ యూజర్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో వాడిని ఫొటోలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలేనన్నారు.
ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. బీజేపీ మేనిఫెస్టో రాసిన వారిపై జోక్స్ వేశారు. ‘ప్రియమైన బీజేపీ మేనిఫెస్టో రచయితలారా? టీఆర్ఎస్ చేసిన పనిని మీ బీజేపీ మేనిఫెస్టోలో చూపించారు. మేం చేసిన పనికి మీరు ఇచ్చిన కితాబుగా మేం భావిస్తాం. కానీ, ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తా. హైదరాబాద్లో ఒక మాట అంటారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి.
Dear BJP manifesto writers,
Glad that you chose pictures of the work done by TRS Govt in your GHMC manifesto
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వస్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. 2016లో ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం ఫొటో కూడా మార్చలేదంటూ టీఆర్ఎస్ పార్టీని బీజేపీ ట్రోలింగ్ చేసింది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో తాము అభివృద్ధి చేసిన ప్రాంతాల ఫొటోలు వాడుకున్నారంటూ గులాబీ పార్టీ కమలనాధులను నెట్టింట్లో ట్రోలింగ్ చేస్తోంది.
బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు
బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. తాము గెలిస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని అన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి రూ. 25 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నర్ స్కూలు పిల్లలకు ట్యాబ్ ఇవ్వడంతో పాటు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష మంది పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. 125 గజాల లోపు ఇళ్లకు ఉచితంగా అనుమతి ఇస్తామని తెలిపింది.
గ్రేటర్లో తాము గెలిస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందజేస్తామని.. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామని.. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.