
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మ్యాప్
Article 370 | Jammu and Kashmir | బీజేపీ ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించింది. అందులో ఆర్టికల్ 370కి అసలు కారకుడు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని చెబుతూ, ఆయనే చరిత్రాత్మక తప్పిదం చేసిన వ్యక్తి అని చిత్రీకరించింది.
ఆర్టికల్ 370.. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన అధికరణ. భారతదేశంలో ఆ రాష్ట్రం భాగమే అయినా దానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని, ప్రత్యేక జెండాను కల్పించిన ఆ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, ఎన్నో చిన్న చిన్న సంస్థానాలను విలీనం చేసుకున్న ఇండియా జమ్మూ కశ్మీర్‌కు మాత్రం ఎందుకు మినహాయింపు ఇచ్చింది? దానికి ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హక్కులు ఎందుకు కల్పించింది? దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? తదితర ప్రశ్నలకు సంబంధించి బీజేపీ ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించింది. అందులో ఆర్టికల్ 370కి అసలు కారకుడు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని చెబుతూ, ఆయనే చరిత్రాత్మక తప్పిదం చేసిన వ్యక్తి అని చిత్రీకరించింది. వివరంగా చెప్పాలంటే.. విలన్ నెహ్రూ అనేలా షార్ట్ ఫిల్మ్ తీసింది. దీనికి సంబంధించిన వీడియో బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆర్టికల్ 370 రద్దు గురించి మోదీ వ్యాఖ్యలతో ప్రారంభమయ్యే ఆ వీడియోలో.. ‘సర్ధార్ పటేల్ దాదాపు 500 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ విలీనానికి సంబంధించి ఆ బాధ్యతను నెహ్రూ తీసుకున్నారు. ఆర్టికల్ 370 పేరుతో ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల కశ్మీర్ అంశం ఐక్యరాజ్యసమితి వద్దకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ అధికరణను రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, పటేల్ వ్యతిరేకించారు.’ అని ఉంది.
ఆర్టికల్ 370 చరిత్రాత్మక తప్పదమని, దాంతో 70 ఏళ్ల పాటు కాశ్మీర్ రక్తం చిందించిందని, లక్షలాది మంది ప్రజలు తమ హక్కులను కోల్పోయారని, పిల్లల రాళ్లు పట్టే దారుణ స్థితి వచ్చిందని రాసింది. అయితే, మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో రెండు రాజ్యాంగాల విధానానికి, రెండు జెండాల పద్ధతికి చరమగీతం పాడామని పేర్కొంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:September 06, 2019, 06:14 IST