బీజేపీ అగ్ర నేతలకు రూ.1800 కోట్ల లంచం..ఎన్నికల వేళ 'యెడ్డీ డైరీ' ప్రకంపనలు

ఎన్నికల వేళ క్యారవాన్ మ్యాగజైన్ కథనాలు దేశరాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీటిని చూపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల తూటాను సంధిస్తోంది కాంగ్రెస్. యడ్డీ డైరీస్‌పై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

news18-telugu
Updated: March 29, 2019, 8:01 PM IST
బీజేపీ అగ్ర నేతలకు రూ.1800 కోట్ల లంచం..ఎన్నికల వేళ 'యెడ్డీ డైరీ' ప్రకంపనలు
క్యారవాన్ కథనానలు మీడియాకు చూపిస్తున్న సూర్జేవాలా
  • Share this:
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీపై కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. గతంలో కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్ప నుంచి రూ.1800 కోట్ల లంచం తీసుకున్నారంటూ బీజేపీ అగ్రనేతలపై అవినీతి బాంబుపేల్చారు. బీజేపీ ముడుపుల బాగోతాన్ని 'క్యారవాన్' మ్యాగజైన్ బయటపెట్టిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. 'యెడ్డీ డైరీస్' పేరిట క్యారవాన్ ప్రచురించిన వార్తా కథనాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మీడియా ముందు ప్రదర్శించారు. ఇప్పుడీ వ్యవహారం దేశరాజకీయాల్లో దుమారం రేపుతోంది.

ఓ కర్నాటక ఎమ్మెల్యేకు చెందిన 2009 డైరీలో యడ్యూరప్ప ముడుపుల వివరాలు ఉన్నాయని క్యారవాన్ మేగజైన్ పేర్కొంది. అందులో రాజ్‌నాథ్ సింగ్ నుంచి అరుణ్‌జైట్లీ వరకు పలువురు బీజేపీ అగ్రనేతల పేర్లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరెవరికి ఎంత డబ్బు ముట్టిందన్న వివరాలను స్వయంగా యెడ్యూరప్పే తన చేత్తో డైరీలో రాశారని తెలిపారు.

బీజేపీ కేంద్ర కమిటీ - రూ.1000కోట్లు
అరుణ్ జైట్లీ - రూ.150 కోట్లు
నితిన్ గడ్కరీ - రూ.150 కోట్లు
రాజ్‌నాథ్ సింగ్ - రూ. 100 కోట్లు
ఎల్‌కే అద్వానీ - రూ.50 కోట్లుఎంఎం జోషి - రూ.50 కోట్లు
నితిన్ గడ్కరీ కుమారుడి పెళ్లి -రూ. 10 కోట్లు


యడ్యూరప్ప కర్నాటక సీఎంగా ఉన్న సమయంలో బీజేపీ కేంద్ర కమిటీ రూ.2690 కోట్లు అడిగారని డైరీలో ఉంది. యడ్యూరప్ప మాత్రం రూ.1800 కోట్లు చెల్లించారు. ఆ డైరీలో నిజం లేకుంటే బీజేపీ ఎందుకు దర్యాప్తు చేయించడం లేదు.
రణ్‌దీప్ సూర్జేవాలా


ఎన్నికల వేళ క్యారవాన్ మ్యాగజైన్ కథనాలు దేశరాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీటిని చూపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల తూటాను సంధిస్తోంది కాంగ్రెస్. యడ్డీ డైరీస్‌పై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలను కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్ప తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో మైలేజ్ కోసం కాంగ్రెస్ అర్థంలేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
ఆ పత్రాలు నకిలీవని ఐటీ అధికారులు గతంలోనే తేల్చారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నాం. వారిపై పరువు నష్టం దావా వేస్తా.
యెడ్యూరప్ప, బీజేపీ నేత
మరోవైపు కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్ సైతం కాంగ్రెస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతో అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారని..ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు.

First published: March 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading