ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తిరుమల ఆలయంపై కొద్దిరోజుల క్రితం మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి కొడాలి నానిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల ఆలయంపై మంత్రి కొడాలినాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ నేతలు కోరారు. అన్నివర్గాల మనోభావాలను కాపాడతానని సీఎం ప్రమాణ స్వీకారం చేశారన్న బీజేపీ నేతలు... తిరుమల ఆలయంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. అన్యమతస్థులు ఆలయంలోకి రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని బీజేపీ భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. తన మంత్రివర్గంలో వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీఎందే బాధ్యత వ్యాఖ్యానించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.