తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నేతలపై గంగుల కమలాకర్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ హిమయత్ నగర్ బీజేపీ నేతలు ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పేరిట 300 మంది గంగుల కమలాకర్ అనుచరులు ఇక్కడ మోహరించి బీజేపీ చెందిన పోస్టర్లను చించివేస్తున్నారని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన అనుచరులు తమ నాయకుల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్నారని కూడా తెలిపారు. హిమాయత్‌నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గడ్డం మహాలక్ష్మి భర్త రామన్‌గౌడ్‌తో పాటు ఇతర నేతలు నారాయణగూడ పోలీసు స్టేషన్లో గంగుల కమలాకర్‌పై ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు.
ఇక, నేటితో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్ని ఓటర్లపై వరాల జల్లులు కురిపించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి బీజేపీ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది వస్తారా? అంటూ బీజేపీ నేతల ప్రచారంపై ఫైర్ అయ్యారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆ పార్టీకి చెందిన పలువురు జాతీయ నాయకులు ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ బీజేపీ ప్రచారానికి మరింత జోష్ ఇవ్వడానికి మరికాసేపట్లో హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోనున్న అమిత్ తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఇక, డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.