Telangana: తెలంగాణలో మరో ఉపఎన్నిక.. మాజీ మంత్రి కుమారుడికి బీజేపీ గాలం..!

బీజేపీ జెండాలు (File)

Telangana Politics: దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడదే ఫార్ములాను నాగార్జునసాగర్‌లో అమలు చేయాలని భావిస్తోంది. అందుకోసం బలమైన నేత కోసం అన్వేషిస్తోంది.

 • Share this:
  దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. అదే ఊపు.. దూకుడుతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగింది. బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపి.. టీఆర్ఎస్‌కు పోటీగా ప్రచారం నిర్వహించింది. అంతేకాదు ఇదే అదునుగా పార్టీని బలోపేతం చేస్తోంది కాషాయదళం. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్‌ను తమ పార్టీలో చేర్చుకుంది. రేపో మోపో కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా కాషాయ దళంలోకి చేరేందుకు అంతా సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణం చెందారు. త్వరలోనే అక్కడ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంతో.. బీజేపీ ప్రత్యేక దృష్టిసారించింది.

  దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటింది. దివంగత ఎమ్మెల్యే సతీమణి సుజాతను ఓడించి అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడదే ఫార్ములాను నాగార్జునసాగర్‌లోనూ అమలు చేయాలని భావిస్తోంది కమలదళం. అందుకోసం బలమైన నేత కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితే ఉపఎన్నికల్లో.. పార్టీ టికెట్‌ను మీకే ఇస్తామని రఘువీర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం.

  మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్య చేతిలో ఓడిపోయిన జానారెడ్డి.. ఎప్పటి నుంచో తన కుమారుడి రాజకీయ భవితవ్యంపై దృష్టసారించారు. గత ఎన్నికల్లో తన కుమారుడు రఘువీర్‌ను కాంగ్రెస్ పార్టీ తరపున సాగర్ నుంచి బరిలోకి దింపి.. తాను మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఒక ఫ్యామిలీ నుంచి ఓకే టికెట్ ఇస్తామని.. అది కూడా నాగార్జునసాగర్ నుంచి మీరే పోటీ చేయాలని పార్టీ పెద్దలు చెప్పారు. అలా గత ఎన్నికల్లో రఘువీర్‌కు అవకాశం దక్కలేదు. పైగా జానారెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పట్టు కోల్పోతుండగా.. బీజేపీ తిరిగి పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే రఘువీర్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నింస్తోందని.. జానారెడ్డి ఫ్యామిలీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  TRS MLA Nomula Narasimhaiah Passes Away, Nomula narasimhaiah dead, trs mla nomula narasimhaiah dead, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత, నోముల నర్సింహయ్య, ఎమ్మెల్యే నర్సింహయ్య మృతి, తెలంగాణ రాజకీయాలు
  నోముల నర్సింహయ్య(ఫైల్ ఫోటో)


  కాగా, నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోముల నర్సింహయ్య.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కొన్ని వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే ఆ తరువాత కూడా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ వచ్చారు. కొద్దిరోజుల నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నోముల నర్సింహయ్య.. గుండెపోటు రావడంతో చనిపోయారు. రాజకీయాల్లో మచ్చలేని నేతగా ఉన్న నర్సింహ్మయ్య మరణం పట్లు సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
  Published by:Shiva Kumar Addula
  First published: